గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 నవంబరు 2020 (09:45 IST)

చార్మీ ఇంట్లో 'డార్లింగ్' ప్రభాస్‌కు ఏం పని? అలా ఫోటోలకు ఫోజు!

హీరోయిన్ నుంచి నిర్మాతగా మారిన నటి చార్మీ కౌర్. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి సంయుక్తంగా పలు చిత్రాలు నటిస్తోంది. ఇప్పటికే ఆమె నిర్మాణ సారథ్యంలో నిర్మించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించాయి. 
 
ఈ క్రమంలో తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటో ఇపుడు వైరల్ అయింది. ఈ ఫోటోలో ఓ శునకంతో ప్రభాస్ కనిపిస్తున్నారు. ఈ ఫొటో గురించి చార్మీ ట్వీట్ చేసింది. 'తన 9 నెలల వయసున్న పెంపుడు కుక్కతో ప్రభాస్' అంటూ పేర్కొంది. 
 
ఓ విశాలమైన సోఫాలో కూర్చున్న ప్రభాస్... చార్మీకి చెందిన అలాస్కన్ మలాముటే జాతికి చెందిన జాగిలంతో రాజసం ఒలకబోయడం ఆ ఫొటోలో చూడొచ్చు. ఈ పెంపుడు కుక్కను చూస్తుంటే ఎంతో ముద్దుగా కనిపిస్తోంది. 
 
ప్రభాస్ గతంలో చార్మీతో 'పౌర్ణమి', 'చక్రం' చిత్రాల్లో నటించాడు. కాగా, ప్రభాస్ పూరీకనెక్ట్స్ కార్యాలయానికి వచ్చినప్పుడు ఈ ఫొటోను క్లిక్ మనిపించినట్టు తెలుస్తోంది. ప్రభాస్... పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'బుజ్జిగాడు', 'ఏక్ నిరంజన్' చిత్రాల్లో నటించడం తెలిసిందే.