అమ్మాయిలు కావాలంటే పూరీకి ఫోన్ చేస్తే రెడీ.... ఏంటి సంగతి?
టాలీవుడ్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ రూటే సెపరేటు. గురువు రాంగోపాల్ వర్మలానే ఈయన నిర్ణయాలు కూడా సంచలనాత్మకంగానే ఉంటాయి. ఇంతకీ పూరీకి ఫోన్ చేయడమేమిటి... అమ్మాయిలు సిద్ధమేమిటి అని అనుకుంటున్నారా... మరేంల
టాలీవుడ్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ రూటే సెపరేటు. గురువు రాంగోపాల్ వర్మలానే ఈయన నిర్ణయాలు కూడా సంచలనాత్మకంగానే ఉంటాయి. ఇంతకీ పూరీకి ఫోన్ చేయడమేమిటి... అమ్మాయిలు సిద్ధమేమిటి అని అనుకుంటున్నారా... మరేంలేదు... సహజంగా సినిమాలను తీసేందుకు నిర్మాతలు రెడీ అయిపోతుంటారు కదండీ. ఐతే హీరోతో పాటు మిగిలిన నటులు కుదిరినా అందమైన హీరోయిన్ మాత్రం ఓ పట్టాన దొరకదు. గ్లామర్ అందాలు ఉన్న హీరోయిన్ ఉంటేనే కదా సినిమాలు చూస్తారు ప్రేక్షకులు.
అందుకని అలాంటి అందమైన హీరోయిన్లను కొత్త నిర్మాతలు, ఆ మాటకొస్తే పాత నిర్మాతలు కూడా వెతుక్కునే పని లేకుండా పూరీ జగన్నాథ్ ఓ ఏర్పాటు చేశారు. అదేంటయా అంటే... పూరి కనెక్ట్స్ అనే కంపెనీతో హీరోయిన్లను అందుబాటులోకి వచ్చేట్లు చేశాడు. ముంబైకు చెందిన తొయాబా అనే టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీతో కలసి హైదరాబాద్ నగరంలో ఈ సంస్థను ఏర్పాటు చేశాడు పూరీ. వీరిని కనుక సంప్రదిస్తే చిటికెలో హీరోయిన్ దొరికిపోతుందన్నమాట. ఇంతకుమునుపు హీరోయిన్ల కోసం ముంబై, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడంతా ఆ పరిస్థితి లేదు. పూరి కనెక్ట్సును సంప్రదిస్తే చాలు.