సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2020 (20:12 IST)

బిగ్ బాస్ రియాల్టీ షో.. గీతా మాధురి భర్తపై సీరియస్.. (video)

Nandu
బిగ్ బాస్ రియాల్టీ షో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించి ప్రోమోలు విడుదల చేశారు నిర్వాహకులు. ఇక ఈ షోకి కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో వచ్చిన ప్రోమోలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
 
బిగ్‌బాస్‌లో ఎవరెవరో ఉండబోతున్నారనే విషయం ఎప్పటిలానే సీక్రెట్‌ గానే ఉంచారు నిర్వాహకులు. అయితే, ఇప్పటికే లీకులు బయటకు వచ్చాయి. ఇంచుమించుగా షోలో ఉండేవారెవరో ఒక అంచనా వచ్చేసింది. అయితే, ఇప్పుడు ఆ లిస్టులో ఒకరు షో ప్రారంభం కాకుండానే ఎలిమినేట్ అయిపోయేలా ఉన్నారనే సంగతి సంచలనంగా మారింది.
 
బిగ్‌బాస్ సీజన్ నాలుగో మరికొన్ని రోజుల్లో మొదలవబోతుంది. ఈ మేరకు ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఇప్పటికే బిగ్‌బాస్ కంటెస్టంట్స్‌ని క్వారంటైన్‌లో ఉంచారు. ఇక బిగ్‌బాస్‌లోకి ఎవరు వెళ్ళేది షోలో అనౌన్స్ చేసే వరకు తెలియదు. కంటిస్టంట్స్ ఎవ్వరు కూడా చెప్పకూడదనేది నిబంధన. అయితే సింగర్ గీతా మాధురి భర్త నందు మాత్రం బాగా తొందర పడ్డాడు. తను బిగ్‌బాస్‌కి వెళ్తున్నానంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. సపోర్ట్ చెయ్యాలంటూ కోరాడు. 
 
అయితే ఇది బిగ్‌బాస్ నిబంధనలకు విరుద్ధం.. నిబంధనలు ఉల్లంఘించినందుకు బిగ్‌బాస్ షో నిర్వాహకులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారన్నది తెలియాలి. అయితే ఈ విషయంపై బిగ్‌బాస్ షో నిర్వాహకులు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. 
 
నిబంధనల ప్రకారం షో గురించి కానీ షోలో పార్టిసిపేషన్ గురించి గానీ రహస్యంగా ఉంచాలి. బిగ్‌బాస్ సీజన్-2లో పాల్గొన్న గీతామాధురికి షో నిబంధనల గురించి తెలియంది కాదు. అలాగే ఇప్పడు సీరియస్‌గా యాక్షన్ తీసుకోకపోతే బిగ్‌బాస్ నిబంధనలకు విలువలేకుండా పోతుందనేది షో నిర్వాహకుల ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తుంది. తొందరపడి ముందుగానే లీక్ చేసినందుకు నందుని షో నుండి తప్పించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
 
ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ 4 ఆగస్టు 30వ తేదీన ప్రారంభం అయ్యే అవకాశాలు కచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ మేరకు ఏర్పాట్లు జరిగిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 15 మంది కంటిస్టంట్‌లు బిగ్ బాస్ క్వారంటైన్‌లో ఉన్నారు. వీరంతా రోజుల క్వారంటైన్ ముగించుకుని బిగ్ బాస్ షోలో అడుగుపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. కరోనా వైరస్ ఇబ్బందుల నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు నిర్వాహకులు తీసుకుంటున్నారు.