శనివారం, 13 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (14:20 IST)

సీనియర్ నటుడు కాంతారావు సతీమణి కన్నుమూత..

hymavathi
ప్రమఖ సినీ నటుడు కాంతారావు సతీమణి హైమావతి(87) శుక్రవారం తుది శ్వాస విడిచారు. గురువారం మధ్యాహ్నాం 12 గంటల సమయంలో మల్లాపూర్‌లోని వారి నివాసంలో ఆమె గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమె కన్నుమూశారు. కాంతారావు 2009 మార్చి 22న మరణించారు. హైమావతి మృతి పట్ల తెలుగు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 
 
కాంతారావు, హైమావతి దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ రోజు ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. కాంతారావు 1940లో సుశీల అనే మహిళను వివాహాం చేసుకున్నారు. అయితే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురవడంతో హైమావతిని రెండో వివాహం చేసుకున్నారు. 
 
వీరి పెళ్లి జరిగిన కొన్ని రోజులకు సుశీల మరణించారు. కాంతారావు సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని గుడిబండ గ్రామంలో జన్మించారు. అనేక సాంఘీక, జానపద చిత్రాల ద్వారా తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేశారు. ఆయన 400లకు పైగా చిత్రాల్లో నటించారు.