శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 19 జనవరి 2019 (09:20 IST)

ఆ పని చేశారని తెలుసుకునేందుకు ఎనిమిదేళ్లు పట్టింది : స్వర భాస్కర్

బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్లలో స్వర భాస్కర్ ఒకరు. ఈమె తాజాగా తనకు ఎదురైన లైంగి వేధింపుల గురించి వెల్లడించింది. తనపై ఓ దర్శకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారనీ, ఆ విషయం తెలుసుకునేందుకు తనకు ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు పట్టిందని వెల్లడించింది. లైంగిక వేధింపుల గురించి మహిళలకు బోధించని మన సంస్కృతే ఇందుకు కారణమన్నారు. 
 
హార్వే విన్‌స్టీన్ జీవితంపై నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇలాంటి చర్చా కార్యక్రమాల్లో ఇతర మహిళల అనుభవాలను విని, తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు గుర్తించానని చెప్పారు. దేశంలో లైంగిక వేధింపుల పట్ల మౌనం వహించే సంస్కృతి ఉందని, మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ వీటిని సరిగా గుర్తించడం లేదని చెప్పారు. దీన్ని కేవలం అసౌకర్యంగా మాత్రమే భావించే పరిస్థితి ఉందన్నారు.