శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 మే 2020 (11:58 IST)

చిరంజీవిపై చెన్నై చంద్రం ఆసక్తికరమైన ట్వీట్...

మెగాస్టార్ చిరంజీవిపై చెన్నై చంద్రం త్రిష ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. మంగళవారం త్రిష పుట్టిన రోజును జరుపుకుంది. ఈ సందర్భంగా త్రిష ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ''ఆచార్య'' చిత్రం నుంచి త్రిష తప్పుకున్నా చిరు మాత్రం ఆ విషయాన్ని లైట్ తీసుకుని త్రిషకు శుభాకాంక్షలు చేశారు. 
 
"జన్మదిన శుభాకాంక్షలు త్రిష. నీ జీవితం సంతోషం, విజయంతో నిండిపోవాలని కోరుకుంటున్నా. ఈ ఏడాది నీకు గొప్పగా వుండాలని ఆశిస్తున్నా'' అని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన త్రిష మెగాస్టార్‌కు ధన్యవాదాలు తెలిపింది. ''స్వీటెస్ట్ లెజెండ్ చిరంజీవికి ధన్యవాదాలు'' అని బదులిచ్చింది త్రిష. 
 
మెగాస్టార్ చిరంజీవి నటించిన ''స్టాలిన్‌'' చిత్రంలో త్రిష కథానాయికగా నటించింది. ఆ తరువాత మళ్లీ ఇన్నేళ్ల విరామం తరువాత వీరిద్దరూ కలిసి ''ఆచార్య'' చిత్రంలో నటిస్తారని అంతా భావించారు. కానీ త్రిష మాత్రం క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నానని తెలిపింది.