గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 19 సెప్టెంబరు 2018 (15:23 IST)

త్రివిక్రమ్ దర్శకత్వంలోనే బన్నీ మరో చిత్రం..?

నా పేరు సూర్య తరువాత బన్నీ తన మరో సినిమా విషయంలో ఇంతవరకు ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ మరో చిత్రంలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నా కూడా అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. త్రివిక్రమ్ కథలో తన నుండి ప్రేక్షకులు ఆశించ

నా పేరు సూర్య తరువాత బన్నీ తన మరో సినిమా విషయంలో ఇంతవరకు ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ మరో చిత్రంలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నా కూడా అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. త్రివిక్రమ్ కథలో తన నుండి ప్రేక్షకులు ఆశించే మాస్ అంశాలు తక్కువగా ఉంటాయని బన్నీ భావిస్తున్నాడట.
  
 
బన్నీవాసు, వక్కంతం వంశీ కూడా బన్నీకి నచ్చే విధంగా ఒక కథను సెట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. కానీ నా పేరు సూర్య తరువాత బన్నీ ప్రయోగాల జోలికి వెళ్ళకుండా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే చేయాలని అనుకున్నాడట. ఎన్టీయార్ అరవింద సమేత సినిమా పనులు ముగిసిన తరువాత త్రివిక్రమ్.. బన్నీ మధ్య చర్చలు జరుగునున్నట్లు సమాచారం. వెంకటేశ్‌తో కంటే ముందుగా బన్నీతోనే త్రివిక్రమ్ సినిమా చేసే ఛాన్స్ ఉందని ఫిల్మ్ నగర్ టాక్.