సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: బుధవారం, 5 సెప్టెంబరు 2018 (18:56 IST)

చైతు డైరెక్ట‌ర్‌కి విజ‌య్ ఓకే చెబుతాడా..?

టాలీవుడ్ యంగ్ హీరోల‌కు కంటిమీద నిద్ర‌లేకుండా చేస్తోన్న యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ గీత గోవిందం సినిమాతో బ్లాక్‌బ‌ష్ట‌ర్ సొంతం చేసుకుని స‌రికొత్త

టాలీవుడ్ యంగ్ హీరోల‌కు కంటిమీద నిద్ర‌లేకుండా చేస్తోన్న యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ గీత గోవిందం సినిమాతో బ్లాక్‌బ‌ష్ట‌ర్ సొంతం చేసుకుని స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసాడు. దీంతో విజ‌య్‌తో సినిమాలు చేసేందుకు క్యూ క‌డుతున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. అయినా విజ‌య్ రెండు సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఖాళీగా లేడు. ఇదిలావుంటే... చైతుతో శైల‌జారెడ్డి అల్లుడు సినిమాని తెర‌కెక్కించిన మారుతి విజ‌య్‌తో సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌.
 
మారుతి తన తర్వాత సినిమాని యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్లో చేయ‌నున్నాడు. మారుతి కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. ఆ కామెడీ టైమింగ్‌కి, విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ క‌లిస్తే ఇక విజ‌యం ఖాయం. మ‌రి.. విజ‌య్ మారుతితో చేయ‌డానికి ఓకే అంటే 2019లో సినిమా ఉండ‌చ్చు. ఓకే చెబుతాడా..? విజ‌య్ ఓకే అంటే... అప్ప‌టివ‌ర‌కు మారుతి ఖాళీగా ఉంటాడో ఈ గ్యాప్‌లో వేరే సినిమా చేస్తాడో చూడాలి.