మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 24 జులై 2019 (16:49 IST)

చిరంజవి హీరోయిన్‌పై హత్యాయత్నం కేసు... ఆరా తీసిన మెగాస్టార్?

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలు మాస్టర్, ఇద్దరు మిత్రులు. ఈ రెండు చిత్రాల్లో సాక్షి శివానంద్ నటించింది. ఇందులో మాస్టర్ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించగా, ఇద్దరు మిత్రులు చిత్రంలో ఓ మంచి స్నేహితురాలిగా నటించింది. ఆ తర్వాత మోహన్ బాబు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ వంటి దిగ్గజ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి హీరోయిన్ ప్రస్తుతం చిక్కుల్లో పడింది. 
 
సాక్షి శివానంద్ సోదరీ శిల్బా ఆనంద్... సచలన ఆరోపణలు చేసింది. తన అక్క సాక్షి శివానంద్ తనను హత్య చేసేందుకు ప్లాన్ వేసిందంటూ ఆరోపించింది. ఇందులో సాక్షి అత్త ప్రమేయం కూడా ఉందని పేర్కొంది. ముఖ్యంగా, తన బీమా డబ్బుల కోసమే తనపై ఈ హత్య ప్రయత్నం చేసినట్టు ప్రకటించి సంచలన సృష్టించింది. 
 
గతంలో తన తల్లిపై కూడా ఇలాగే తన అక్క... ఆమె అత్త హత్యాయత్నానికి ప్రయత్నించినట్టు తెలిపింది. ఈ విషయమై తాను ఫిర్యాదు చేసేలోపు వాళ్లు అమెరికాకు పారిపోయారంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై పోలీసులు విచారణ జరిపి వాళ్లను తగిన విధంగా శిక్షించాలని కోరింది. కాగా, సాక్షి శివానంద్ వ్యవహారం చిరంజీవి దృష్టికి వెళ్లినట్టు సమాచారం.