గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 డిశెంబరు 2021 (07:59 IST)

టీవీ సీరియల్ నటి లహరి అరెస్ట్: మద్యం సేవించి కారు నడిపిందా?

Lahari
ప్రముఖ టీవీ సీరియల్ నటి లహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్‌లో తన కారుతో బైక్‌ను సీరియల్ నటి లహరి ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళుతున్న వ్యక్తికి గాయాలు అయ్యాయని సమాచారం అందుతోంది.

స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన శంషాబాద్ పోలీసులు కారుతో పాటు సీరియల్ నటి ని పోలీస్టేషన్‌కు తరలించారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేటు పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తి డ్యూటీ ముగించుకుని శంషాబాద్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం  చోటుచేసుకుంది. గాయపడిన వారు ఫిర్యాదు చేయలేదని.. కానీ లహరి మద్యం సేవించి కారు నడిపినట్లు శంషాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు.