మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 25 జనవరి 2022 (17:49 IST)

జయహో ఇండియన్స్ నుంచి విడుదలైన ఆంథమ్‌కు అనూహ్య స్పందన

Jayaho Indians
ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ పతాకంపై రాజ్ భీమ్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా `జయహో ఇండియన్స్`. ఆర్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మతం పేరుతో రగిలే కార్చిచ్చులో బలయ్యేదెవరు.. నాయకులా..? అమాయకులా..? దేశమా..? ఈ కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. అది స్పష్టంగా పోస్టర్లో కనిపించేలా హీరో లుక్ డిజైన్ చేశారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ సినిమా వీడియో సాంగ్ విడుదలైంది. జయహో ఇండియన్స్ ఆంథమ్ ఇది. గణతంత్ర‌ దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది. ఈ పాటలో లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. జైపాల్ రెడ్డి నిమ్మల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.
 
నటీనటులు:
రాజ్ భీమ్ రెడ్డి, జారా ఖాన్, చమ్మక్ చంద్ర, సమీర్, ముక్తార్ ఖాన్, CVL నరసింహా రావు, రామరాజు, చిత్రం శ్రీను, అనంత్, టార్జాన్, గగన్ విహారి..
 
టెక్నికల్ టీం:
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకుడు: ఆర్ రాజశేఖర్ రెడ్డి
నిర్మాణ సంస్థ: ది భీమ్ రెడ్డి క్రియేషన్స్
నిర్మాత: రాజ్ భీమ్ రెడ్డి
సంగీతం: సురేష్ బొబ్బిలి
సౌండ్ డిజైన్: నాగార్జున తాళ్ళపల్లి
సినిమాటోగ్రఫీ: జైపాల్ రెడ్డి నిమ్మల
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
గాత్రం: యాజిన్ నిజార్
లిరిక్స్: కాసర్ల శ్యామ్
VFX: విరించి ప్రొడక్షన్స్
ఆర్ట్: మోహన్, నాగు
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే