ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 మార్చి 2024 (09:59 IST)

రాష్ట్రపతిని కలిసిన ఉపాసన.. క్లీంకార ముఖం తెలియకుండా..

UPasana
UPasana
ఆర్ఆర్ఆర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు. తన బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటూనే, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె విస్తృతంగా పాల్గొంటుంటారు. తాజాగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉపాసన కలిశారు. తన కూతురు క్లీంకారతో కలిసి రాష్ట్రపతిని కలిశారు. 
 
అయితే ఈ వేడుకలో కూడా క్లీంకార ముఖం కనిపించకుండా ఉపాసన జాగ్రత్త పడ్డారు. ఈ సందర్భంగా ఉపాసన ఎక్స్ వేదికగా స్పందిస్తూ... భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తన కుమార్తె క్లీంకారతో కలిసి కలవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు, ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కామ్లేశ్ దాజీకి ధన్యవాదాలు తెలిపారు .