శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 మార్చి 2024 (08:55 IST)

రాజ్యసభకు నామినేట్ అయిన సుధామూర్తి.. ప్రధాని కితాబు

sudha murthy
ప్రముఖ విద్యావేత్త సుధా మూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆమె నామినేషన్ గురించిన సమాచారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ ద్వారా తెలియజేశారు. ఆమె ఎగువ సభకు నామినేట్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఆమె సభలో ఉండటం దేశ 'నారీ శక్తి'కి శక్తివంతమైన నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ కావడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. 
 
"సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో సహా విభిన్న రంగాలకు సుధామూర్తి చేసిన కృషి అపారమైనది, స్ఫూర్తిదాయకం” అని ప్రధాని మోదీ కొనియాడారు.
 
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్నార్ నారాయణ మూర్తి సతీమణి అయిన సుధామూర్తి.. బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ అత్తమ్మ కూడా. సుధా మూర్తి నారాయణ మూర్తి భార్య హోదాలోనే కాకుండా, విద్య, తదితర రంగాలకు సేవ చేశారు. తద్వారా తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.