అందాలపై ఉపాసన ఎక్స్‌ట్రా కేర్.. సోషల్ మీడియాలో వర్కౌట్ ఫోటోస్.. అందుకే మెరుపుతీగలా?
మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రస్తుతం తన అందాలపై ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటోంది. ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉండే ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఉండే ఉపాసన తాజాగా.. తన కొత్త వర్కవుట్స్ గురించి ఫేస్ బుక్‌లో పెట్టింది.
న్యూయార్క్‌లో మార్నింగ్ వర్కవుట్స్ పేరుతో రెండు ఫోటోలు పోస్టు చేసింది. శక్తికి, టోన్ అప్ కోసం ఈ వర్కవుట్స్ చేస్తున్నట్లు పేర్కొంది. ఇంకా ఈ వర్కవుట్స్ చేసేందుకు ఇషానీ రెడ్డి స్ఫూర్తే కారణమని తెలిపింది. ఆమెకు ప్రత్యేకంగా థ్యాంక్స్ కూడా చెప్పింది. ఇకపోతే.. ఇలాంటి వర్కవుట్స్ ద్వారానే ఉపాసన ముందులా బొద్దుగా కాకుండా స్లిమ్‌గా మెరుపుతీగలా.. అందంగా కనిపిస్తోందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్.