శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 మార్చి 2020 (15:13 IST)

''ఉప్పెన''లా సాగుతున్న ఆ పాట.. యూట్యూబ్‌లో వైరల్

Uppena
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ''ఉప్పెన''లో నటిస్తున్నాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఏప్రిల్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
 
ఈ మధ్యే ఈ సినిమా నుంచి ''నీ కన్ను నీలి సముద్రం'' అంటూ సాగే మొదటి పాటను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ విడుదల చేశారు. ఖవ్వాలి స్టైల్‌లో సాగే ఈ గీతానికి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఓ చక్కని ట్యూన్ అందించారు. 
 
ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఐదు రోజుల్లోనే ఈ పాటకు అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లోనే 10 మిలియన్ వ్యూస్ దాటడం విశేషం. అంతే కాకుండా ఈ పాటకు 1.42 లక్షల లైక్స్ వచ్చాయి. ఇంత తక్కువ సమయంలో పది మిలియన్ వ్యూస్ సాధించడంతో ఈ పాట సూపర్ హిట్ గా మారింది. 
 
ఇక సినిమా విషయాని కి వస్తే ఉప్పెనలో విజయ్ సేతుపతి, సాయిచంద్ బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్.. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.