గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2019 (17:23 IST)

పొద్దస్తమానం హృతిక్ రోషన్ పైనే భార్య ధ్యాస, భర్తకు నచ్చలేదు, చంపేశాడు

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌కు ఆమె వీరాభిమాని. హృతిక్ అంటే విపరీతమైన అభిమానం. అదే ఆమె హత్యకు కారణమైంది. పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత భర్తను కూడా హృతిక్ రోషన్‌తో పోల్చేది. ప్రతిరోజూ హృతిక్‌ను కలవరిస్తుండేది. అతని సినిమాలు విపరీతంగా చూసేది. ఇదే భర్తకు కోపం తెచ్చింది. హృతిక్ రోషన్ కోసం భర్తతో గొడవకు దిగేది. దీంతో భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తి విడిపోయారు. 
 
అయినా భార్యతో మాట్లాడాలని రప్పించి, ఆ భర్త కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన అమెరికా న్యూయార్క్ లోని క్వీన్స్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మృతురాలి పేరు డొన్నె డొజొయ్. ప్రవాస భారతీయురాలు. గుజరాత్‌కు చెందిన డోజో ఐదేళ్ల కిందట అమెరికా వెళ్లారు. న్యూయార్క్‌లో నివసిస్తున్నారు. మూడేళ్ల కిందట ఆమెకు గుజరాత్‌కే చెందిన దినేశ్వర్ బుదిహాట్‌తో ప్రేమ వివాహం అయ్యింది. 
 
పెళ్లికి తరువాత క్వీన్స్ ప్రాంతంలో స్థిరపడ్డారు. క్వీన్స్‌లోని ఓజోన్ రోడ్‌లో ఉండే జెమిని అల్ట్రా లాంజ్‌లో ఆమె బార్ టెండర్‌గా పని చేస్తున్నారు. హృతిక్ రోషన్‌కు ఆమె వీరాభిమాని. భర్త ఎంత చెప్పినా హృతిక్ రోషన్‌పై అభిమానాన్ని తగ్గించుకోలేకపోయింది. వారం రోజుల క్రితం ఇలా భర్తతో ఏర్పడిన వివాదం కారణంగా బార్ అటెండర్ పని చేస్తూ.. స్నేహితురాలితో కలిసి వున్నది. 
 
కానీ భార్యపై కోపంతో వున్న డోజో ఆమెను ఇంటికి రప్పించి కత్తితో చంపేశాడు. ఆపై మరదలికి విషయం చేరవేసి.. ఓ రెసార్ట్‌లో తను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జెమిని అల్ట్రా లాంజ్ బార్ సిబ్బందిని ప్రశ్నించగా.. పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
హృతిక్ రోషన్ పై అభిమానాన్ని తగ్గించుకోవాలంటూ తన భర్త తరచూ గొడవ పడుతుండేవాడని వారు వెల్లడించినట్లు తేలింది. దినేశ్వర్ సున్నిత మనస్తత్వం ఉన్నవాడని, తన భార్య తనను మాత్రమే ప్రేమించాలని కోరుకునే వాడని డోజో స్నేహితులు తెలిపారు. ఈ కారణం వల్లే ఆమెను హత్య చేసి ఉంటాడని చెప్పుకొచ్చారు.