గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (19:51 IST)

సమంతకు మయోసైటిస్.. షాకయ్యా.. యశోద షూటింగ్ తర్వాతే?

Samantha,
హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడటంపై యశోద కో-స్టార్ వరలక్ష్మి శరత్ కుమార్ స్పందించింది. ఈ వార్త విని షాకయ్యానని తెలిపింది. సమంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది. సమంతతో తనకు 12 ఏళ్లుగా పరిచయం ఉందని... తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పింది. 'యశోద' సినిమాలో సమంతతో కలిసి నటించడం తనకు చాలా హ్యాపీగా ఫీలయ్యానని వెల్లడించింది.  
 
సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతోందనే విషయం యశోద షూటింగ్ రోజుల్లో తమకు తెలియదని వెల్లడించింది. ఆమె ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉండేదని చెప్పింది. 'యశోద' సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే ఆమె ఆరోగ్యం క్షీణించిందని భావిస్తున్నట్లు వరలక్ష్మి తెలిపింది. సమంత ఒక ఫైటర్ అని... త్వరలోనే ఆమె కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.