శనివారం, 13 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 అక్టోబరు 2022 (18:19 IST)

సమంతకు మ్యోసిటిస్ వ్యాధి.. ఆస్పత్రిలో చికిత్స.. ఫోటో వైరల్

Samantha Ruth Prabhu
Samantha Ruth Prabhu
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మ్యోసిటిస్ అనే వ్యాధితో బాధ పడుతోంది. అంటే కండరాలకు సంబంధించిన జబ్బు. ఈ వ్యాధి తీవ్రత అధికంగా వుండటంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. ఈ వ్యాధి నుంచి త్వరలో రికవరీ అవుతానని డాక్టర్లు హామీ ఇచ్చిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది సమంత.  
 
సమంత మాటల్లో కొంత సీరియస్ నెస్ ప్రతిధ్వనిస్తున్నా చివరిలో మాత్రం కోలుకోవడానికి ఇంకో రోజు దగ్గరయ్యాననే సానుకూల దృక్పధం చూపించింది. మొత్తానికి మీడియాలో జరిగిన రకరకాల ప్రచారానికి సమంత ఏ జబ్బుతో తాను బాధపడుతున్నాననే విషయంపై క్లారిటీ ఇచ్చేసింది.  
 
ఇంకా హాస్పిటల్ బెడ్ నుంచి వెనుకగా తీసిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోను చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.  
 
చైతుతో విడాకులు తీసుకున్నాక సమంతా కెరీర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది. యశొద నవంబర్ 11 రిలీజయ్యాక తర్వాతి వరసలో గుణశేఖర్ శాకుంతలం ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషిలో నటిస్తోంది.