శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2017 (14:45 IST)

వేసవి సెలవుల్లో విక్టరీ వెంకటేష్ 'గురు'

తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి, తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇప్పుడు మరొక విన్నూత్నమైన పాత్రలో కనిపించనున్నారు. సుధా కొంగర దర్శకత్వం వహించిన "గు

తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి, తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇప్పుడు మరొక విన్నూత్నమైన పాత్రలో కనిపించనున్నారు. సుధా కొంగర దర్శకత్వం వహించిన "గురు" చిత్రంలో బాక్సింగ్ కోచ్ పాత్రలో విక్టరీ వెంకటేష్ కనిపిస్తారు. 
 
స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో ఉండే ఈ స్పోర్ట్స్ డ్రామాను వేసవి సెలవుల్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధపడుతోంది. ఈ చిత్రంలోని "ఏయ్ సక్కనోడా" పాట లిరికల్ వీడియోను ఈ నెల 17న విడుదల చేస్తున్నట్లు నిర్మాత శశికాంత్ తెలిపారు. 
 
"సుప్రసిద్ధ దర్శకులు మణిరత్నంతో పని చేసి, మిత్ర్  సినిమాతో నేషనల్ అవార్డు దక్కించుకున్న సుధా కొంగర ఈ చిత్రాన్ని మలచిన తీరు అద్భుతం. విక్టరీ వెంకటేష్‌ను ఇప్పటి వరకు చూడని ఒక సరికొత్త లుక్‌లో ప్రెసెంట్ చేస్తున్నాం. మంచి ఎమోషన్స్‌తో సాగే ఒక స్పోర్ట్స్ డ్రామా ఇది. ఈ వేసవిలో విడుదల చేస్తున్నాం. విడుదల తేదీ త్వరలోనే తెలుపుతాం" అని నిర్మాత శశికాంత్ తెలిపారు. 
 
రితిక సింగ్, ముంతాజ్ సర్కార్‌లు ఈ చిత్రంలో వెంకటేష్‌తో పాటు ప్రధాన పాత్రలను పోషిస్తారు. రితిక సింగ్ ఇటీవలే ఉత్తమ నటి క్యాటగిరి‌లో నేషనల్ అవార్డును కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ముంతాజ్ సర్కార్ విషయానికి వస్తే, ఆమె సుప్రసిద్ధ మాంత్రికులు పి.సి. సర్కార్ కుమార్తె. 
 
గురు చిత్రం ఆడియోను మర్చి మొదటివారంలో విడుదల చేస్తారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన సంతోష్ నారాయణ్ గతంలో "కబాలి", "భైరవా" వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు.