గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 15 డిశెంబరు 2023 (21:59 IST)

విఘ్నేష్ శివన్, కృతి శెట్టి కొత్త చిత్రం LIC

Kriti Shetty
ప్రేమకథగా తెరకెక్కనున్న చిత్రం LIC. ఈ చిత్రం పూజా కార్యక్రమంలో దర్శకుడు విఘ్నేష్ శివన్, రాక్ స్టార్ అనిరుధ్, ప్రదీప్ రంగనాథన్, హీరోయిన్ కృతి శెట్టి, ఎస్.జె.సూర్య, నిర్మాత లలిత్ కుమార్, సహ నిర్మాత ఎల్.కె.విష్ణు కుమార్ సహా చిత్రబృందం పాల్గొన్నారు. నేటి యువతరాన్ని ప్రతిబింబిస్తూ కొత్త తరహా ప్రేమను తెలిపే రొమాంటిక్ కామెడీ చిత్రంగా, దర్శకుడు విఘ్నేష్ శివన్ డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో అందరినీ ఆకట్టుకునే కమర్షియల్ చిత్రంగా రూపొందుతోంది.
 
ఈ చిత్రంలో లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, నటి కృతి శెట్టి కథానాయికగా నటించింది. ఎస్‌జే సూర్య, మైష్కిన్, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రొమాంటిక్‌ కామెడీ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న విఘ్నేష్‌ శివన్‌, ప్రదీప్‌ రంగనాథన్‌ కాంబినేషన్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
 
Vignesh Sivan, Kriti Shetty
రాక్‌స్టార్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిటింగ్. ప్రవీణ్ రాజా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో తరపున నిర్మాత లలిత్ కుమార్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. సహ నిర్మాత ఎల్.కె.విష్ణు కుమార్. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర సాంకేతిక కళాకారుల వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.