బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (08:19 IST)

ఏప్రిల్ 14న విజయ్ ఆంటోనీ "బిచ్చగాడు-2"

bichagadu
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న తాజా చిత్రం 'బిచ్చగాడు-2'. గతంలో 'బిచ్చగాడు' సంచలన విజయం సాధించింది. తమిళంలో కంటే తెలుగులో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు సినీ ప్రేక్షకులకు విజయ్ ఆంటోనీ అనే ఓ హీరో ఉన్నారనే విషయం తెలిసింది ఈ చిత్రం ద్వారానే. 
 
ఇపుడు దీనికి సీక్వెల్‌గా 'బిచ్చగాడు-2' రానుంది. ఈ చిత్రం నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ సమయంలో కూడా హీరో విజయ్ ఆంటోనీకి ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ చిత్రం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. 
 
తమిళ ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు, అందుకు సంబంధించిన పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. హీరోయిన్‌గా కావ్య థాపర్ నటించగా, కీలకమైన పాత్రలో రితికా సింగ్, రాధారవి, మన్సూర్ అలీఖాన్‌లు నటించారు.