సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (22:31 IST)

విజయ్ ఆంటోనీ 'బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్' : కొత్త కాన్సెప్టుతో "బిచ్చగాడు-2"

bichagadu-2
హీరో విజయ్ ఆంటోనీ కొత్త కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఆయన నటించిన "బిచ్చగాడు" చిత్రం సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఇపుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా "బిచ్చగాడు-2" చిత్రం రానుంది. వేసవిలో ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రంలో స్నీక్‌ పీక్ ట్రైలర్‌ను శుక్రవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంది. సినిమాలోని తొలి మూడున్నర నిమిషాల పాటు నిడివితో వీడియోను రిలీజ్ చేశారు. 
 
ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. నిజానికి తన ప్రతి చిత్రంలో ఎపుడూ ప్రయోగాలు చేయడానికి ముందుండే విజయ్ ఆంటోనీ... ఇందులో కూడా సరికొత్త కాన్సెప్టుతో ముందుకు వచ్చారు. బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆధారంగా రూపొందించినట్టుగా తెలుస్తుంది. ట్రైలర్ ఆఖరులో డబ్బు లోకాన్ని ఖాళీ చేస్తుంది అంటూ ఒక పవర్‌ఫుల్ సందేశంతో ముగించారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 
 
నిజానికి ప్రపంచ వ్యాప్తంగా కిడ్నీ, గుండె, కాలేయం వంటి శరీర అవయవాల మార్పిడి చికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయి. కానీ, ఈ ట్రైలర్‌లో బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది ప్రయోగాల దశలోనే ఉంది. ఇలాంటి ఫిక్షన్ కథలతో సినిమాలు అత్యధికంగా హాలీవుడ్‌లోనే వస్తుంటాయి. ఇపుడు అలాంటి కాన్సెప్టుతో విజయ్ ఆంటోనీ "బిచ్చగాడు-2" చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీని విజయ్ ఆంటోనీ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్నారు.