గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2023 (09:52 IST)

రాయలసీమ స్లాంగ్‌లో డైలాగ్స్ చెప్పనున్న విజయ్ దేవరకొండ

Vijay Deverakonda
రౌడీ హీరో, లవర్ బాయ్ విజయ్ దేవరకొండ అమెరికాకు వెళ్లనున్నాడు. ఫిల్మ్ స్టార్ షూటింగ్ కోసం అక్కడికి వెళ్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి తెరపైకి రానుంది. మరోవైపు ఆఫర్లతో విజయ్ దేవరకొండ బిజీ బిజీగా వున్నారు. 
 
తాజాగా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌తో కొత్త చిత్రం చేయనున్నాడు విజయ్ దేవరకొండ. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ మరో కొత్త స్లాంగ్‌ని ట్రై చేయనున్నాడు. 
 
ఇంతకుముందు పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి వంటి సినిమాల్లో తెలంగాణ యాసలో మాట్లాడి మంచి పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో, అలాగే రాబోయే ఫ్యామిలీ స్టార్‌లో కూడా గోదావరి యాసలో తన చేతిని ప్రయత్నించాడు. 
 
రాహుల్ సాంకృత్యాన్ సినిమా కర్నూలు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్నందున తన తదుపరి చిత్రంలో రాయలసీమ స్లాంగ్‌లో డైలాగ్స్ చెప్పనున్నాడు.