బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 జూన్ 2021 (16:24 IST)

చిక్కుల్లో మాస్టర్.. విజయ్‌కి ఇంగ్లీష్ టైటిల్సే ఎందుకు.. ట్రోలింగ్ మొదలు..!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ కొత్త చిక్కుల్లో పడ్డారు. కొంతకాలంగా విజయ్ సినిమాలన్నీ వివాదాస్పదమవుతూనే ఉన్నాయి. అవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు విజయ్‌ సినిమాల టైటిల్స్‌ కూడా కొత్త కాంట్రర్సీలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. తమిళనాట సినీ అభిమానులకు కూడా భాషాభిమానం కాస్త ఎక్కువే. అందుకే తమిళ సినీ పరిశ్రమలో సినిమాలకు తమిళ టైటిల్స్ పెడితే రాయితీలు కూడా ఇస్తోంది ప్రభుత్వం.
 
అయితే విజయ్‌ మాత్రం ఇలాంటి రాయితీలను పట్టించుకోవటం లేదు. సర్కార్‌, మాస్టర్‌, బీస్ట్‌ లాంటి ఇంగ్లీష్‌, హిందీ పదాలను టైటిల్స్‌గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ విషయంలోనే ఇళయ దళపతిని టార్గెట్ చేస్తున్నారు ఓ వర్గం ఆడియన్స్‌. సినిమాలకు తమిళ టైటిల్సే దొరకటం లేదా? దొరికితే పరభాషా టైటిల్స్ ఎందుకు? అని … ట్రోలింగ్ మొదలు పెట్టారు.
 
బీస్ట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు విజయ్ సిద్ధం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో తమిళ టైటిల్స్ విజయ్ ఎందుకు ఎంచుకోవట్లేదని ట్రోలింగ్ మొదలైంది. ఇప్పటికే మాస్టర్ సినిమాతో సంక్రాంతికి విజయం అందుకున్నాడు విజయ్. ప్యాండమిక్ తర్వాత వచ్చిన ఈ చిత్రం 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.