ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (16:34 IST)

దుర్గా అగ్రహారంలో కత్తులతో స్వైర విహారం.. వ్యక్తి మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. పట్టణంలోని దుర్గా అగ్రహారంలో శుక్రవారం ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అతి కిరాతకంగా కత్తులతో నరికి చంపారు. ఆగంతకుల దాడిలో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు.
 
ఈ హత్య తర్వాత దుండగులు అక్కడ నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారణంగా హంతకులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక హత్యా ఘటనతో స్థానికంగా ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు.