సంబంధిత వార్తలు
- కాటమరాయుడు రీమేక్.. సల్మాన్ సరసన పూజా హెగ్డే.. 'భాయిజాన్'..?
- సమంత ఆవిష్కరించిన పుష్పక విమానంలోని కళ్యాణం సాంగ్
- భర్తంటే ఇష్టంలేదు.. ప్రియుడే ముద్దు... సహజీవనంకు రక్షణివ్వండి.. కోర్టుకు మహిళ
- కట్నం కోసం పడక గదిలో నవవధువును చంపిన కసాయి భర్త
- మా మొగుళ్ళకు మీరు వంట చేసి పెడతారా? కోవిడ్ పాజిటివ్ భార్యల గగ్గోలు
ఇద్దరి బాలికలపై అత్యాచారం, హత్య: పారిపోతున్న నిందితుడిపై కాల్పులు
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ బాలికలిద్దర్నీ హత్య చేసి చెట్టుకు ఉరి తీసారు. వారిది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసారు. ఈ ఘటన అస్సాంలో జరిగింది. ఘటనా స్థలంలో లభించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఓ బాలిక వయసు 14. మరో బాలిక వయసు 16 ఏళ్లు. ఈ ఇద్దరినీ కిడ్నాప్ చేసిన కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రధాన నిందితుడు 22 ఏళ్ల ఫరిజుల్ రెహ్మాన్ పోలీసుల అదుపులో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాంతో అతడిపై కాల్పులు జరిపారు పోలీసులు. ఈ కాల్పుల్లో అతడి కాలికి తీవ్ర గాయమైంది. కాగా మిగతా ముగ్గురు నిందితులపై కుట్ర, సాక్ష్యాలను దాచడం వంటి అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
