బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (16:50 IST)

వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంలోని పాటకు చంద్రబోస్ ప్రశంసలు

chandrabose letter
chandrabose letter
అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై  తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు  నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా "వినరో భాగ్యము విష్ణు కథ". కిర‌ణ్ అబ్బ‌వ‌రం  హీరోగా నటిస్తున్నారు.కిరణ్ సరసన  క‌శ్మీర ప‌ర్ధేశీ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుండి  "వాసవసుహాస" అనే  మొదటి సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం.
 
యుగ యుగాలుగా ప్రభోదమై పది విధాలుగా పదే పదే. పలికేటి సాయ జాడలే కదా నువ్వెదికినదిదైనా..  అని క్లిష్టమైన పదాలను ఈ పాటలో రచించారు గేయ రచయిత కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని. ఈ పాటకు మంచి ఆదరణ లభించి అన్ని వైపుల నుండి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. 
 
తాజాగా ఈ పాటపై స్పందించి తన హృదయపూర్వక  ఆశంసలు తెలిపారు లిరిసిస్ట్ చంద్రబోస్. నేను ఈమధ్య విన్న పాటల్లో చాలా చాలా అరుదైన,విలువైన పాట -వినగానే ఆశ్చర్యానందానికి లోనైన పాట-వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంలోని వాసవ సుహాస గీతం-రాయడానికి ఎంత ప్రతిభ వుండాలో దాన్ని ఒప్పుకోడానికి అంత అభిరుచి భాషా సంస్కరం వుండాలి-కవి కళ్యాణ్ చక్రవర్తి గారికి హృదయపూర్వక ఆశంసలు అంటూ చంద్రబోసు చెప్పుకొచ్చారు. 
 
పైన ప్రస్తావించిన లిరిక్స్ లో "వాడికి సాయం చెయ్యమని చెప్పటానికి ఎత్తిన పది అవతారాలు ఆదర్శమే కదా నీది, అదే కదా నువ్వెళ్ళే దారి అలాంటి నీ దారిలో నవ్వులు పూయకుండా ఎలా ఉంటాయి. ఇప్పటి ఆలోచన నిన్నటి నీ అనుభవం నుండి వచ్చిందే కదా" అంటూ సారాంశాన్ని కూడా ఈ పాటలో జోడించడం విశేషం. 
 
మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌త్య‌గమిడి, శ‌రత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాత‌లు ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.