1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Vishal thanked Saidhansika for saving him

Saidhansika: నన్ను కాపాడుకున్న సాయిధన్సికకు ధన్యవాదాలు: విశాల్

The Makutam team has arrived in Chennai from Kakinada
The Makutam team has arrived in Chennai from Kakinada
కాకినాడలో రెండు వారాల పాటు సాగిన కఠినమైన షెడ్యూల్ తర్వాత మగుడం చిత్రం తెలుగులో మకుటం గా రూపొందుతోంది. ఇటీవలే కాకినాడ షెడ్యూల్ పూర్తిచేసుకుని టీమ్ అంతా విమానంలో చెన్నైకు వచ్చారు. ఈ సందర్భంగా విశాల్ స్పందించారు.  మా టీమ్ చెన్నైకి తిరిగి వచ్చింది. నా ప్రియమైన సిబ్బందికి, ముఖ్యంగా నా డీఓపీ అభినందన్, బృందా మాస్టర్, నా దర్శకత్వ బృందానికి ధన్యవాదాలు. ఈ మొత్తం సమయంలో నాకు అండగా నిలిచినందుకు ప్రభాకు ప్రత్యేక అభినందనలు.
 
 
నా నటీనటులందరికీ, ముఖ్యంగా  అహం, ఆర్భాటం లేని వృత్తిపరమైన వైఖరికి నా ప్రియమైన అంజలికి, నా బెస్టీ జాన్ విజయ్, జేపీ సర్ మరియు మండుటెండలో కూడా నిశ్శబ్దంగా తమ పనిని పూర్తి చేసిన అమ్మాయిలందరికీ ధన్యవాదాలు. నేను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉండి, నేను వదిలిపెట్టకుండా ముందుకు సాగేలా చేసిన నా బెస్ట్ హాఫ్ సాయిధాన్సికకు ప్రత్యేక ధన్యవాదాలు. సుబ్రహ్మణ్యం అన్నే. ధన్యవాదాలు. 
 
సినిమాలో అత్యంత కష్టమైన 90 శాతం మేము పూర్తి చేశాము. రేపటి నుండి చెన్నైలో మా చివరి దశ షూటింగ్ ప్రారంభం కానుంది. మా మొదటి సింగిల్‌తో జీవీ మ్యాజిక్ త్వరలో ఆవిష్కృతం కానుంది. గాడ్ బ్లెస్.అంటూ పేర్కొన్నారు.
 
ఇటీవలే ఓ చిన్న వీడియో విడుదలచేశారు.  హీరోయిన్ అంజలి వద్దకు దర్శకుడైన విశాల్ కథ చెప్పడానికి వెళ్తాడు. ఇక కథ చెప్పండి డైరెక్టర్ గారు అని అంజలి అంటారు. ఒక అందమైన గ్రామం అని విశాల్ అంటే.. అది ప్రొడక్షన్ వాళ్లు చూసుకుంటారు కదా.. ముందు మీరు కథ చెప్పండని కౌంటర్ వేస్తారు అంజలి. ఇలా విశాల్ కథ చెబుతూ ఉంటే మధ్య మధ్యలో అంజలి సెటైర్లు వేస్తుంటారు. విశాల్ ఇలా ఏదేదో చెబుతుంటారు.. అసలు మీ వద్ద కథ ఉందా? అని అంజలి అడగడంతో విశాల్ పారిపోతారు. మంచి కథ అని మేనేజర్ చెప్పారే.. విశాల్ ఏంటి ఇలా చెబుతున్నారని అంజలి అనుకుంటారు. కథ అడుగుతోందే.. ఎలా.. రేపు వచ్చి మరో కథ చెబుదాం అని విశాల్ వెళ్లిపోతారు.
 
ఈ కాన్సెప్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌ బాధ్యతల్ని విశాల్ చూసుకుంటున్నారు. ఈ మూవీ
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
యాంకర్ విష్ణుప్రియతో నాకు పెళ్లా.. ఎవరు చెప్పారు? జేడీ చక్రవర్తి ప్రశ్న