సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 డిశెంబరు 2021 (20:06 IST)

Big Boss Telugu: విన్నర్ ఎవరో తెలుసా?

బిగ్ బాస్ ఫైనల్‌కు వేళాయె. ఈ సీజన్ విజేత ఎవరు అనే అంశంపైనే చర్చ సాగుతోంది. సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్‌లలో ఎవరైనా ఒకరు విజేతగా నిలిచే అవకాశం వుంది. వీజే సన్నీ బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్‌ విన్నర్ అని టాక్ కన్ఫామ్ అయ్యింది. ఫైనల్ విజేతగా సన్నీ నిలిచే అవకాశం 99 శాతం వుందని.. చివరి నిమిషంలో ఏదైనా ట్విస్ట్ జరిగితే చెప్పలేం కానీ.. సన్నీ మాత్రం విన్నరేనని టాక్ వస్తోంది. 
 
ఫైనల్ స్టేజ్‌లో ఏయే కంటెస్టెంట్‌కు ఎన్ని ఓట్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.. ఓటింగ్‌లో 34 శాతం ఓట్లతో సన్నీ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్నట్లు సమాచారం. తర్వాతి స్థానాల్లో షన్ముఖ్ 31 శాతంలో ఓట్లతో రెండో స్థానంలో, శ్రీరామచంద్ర 20శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారని తెలుస్తోంది. 
 
మానస్‌కు 8శాతం, సిరికి 7శాతం ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. దీని బట్టి ఈ సీజన్ విన్నర్ సన్నీ అని క్లియర్‌‌గా తెలుస్తోంది. త్వరలోనే ఈ రియాల్టీ షో ముగియ‌నుంది. అధికారికంగా ఈ సీజ‌న్ విన్న‌ర్ ఎవరో కూడా తెలియనుంది.
 
సెప్టెంబ‌ర్ 5న ప్రారంభ‌మైన బిగ్ బాస్ షో త్వరలో ముగియనుంది. ఈ కార్య‌క్ర‌మం కోసం 19 మంది బిగ్‌బాస్‌లోకి కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి అడుగుపెట్ట‌గా ప్ర‌స్తుతం ఐదుగురు మాత్రమే ఉన్నారు. మానస్, సిరి, ష‌ణ్ముఖ్‌, శ్రీరామ్, స‌న్నీ ప్రస్తుతం హౌజ్‌లో ఉన్నారు.