గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 అక్టోబరు 2021 (14:12 IST)

మీ రాజీనామాలు మా దూకుడును ఆపలేవు : మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో గెలుపొందిన మంచు విష్ణు తన ప్రత్యర్థి వర్గానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ వర్గానికి చెందిన 15 మంది సభ్యులు చేసిన రాజీనామాలపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ మూకుమ్మడి రాజీనామాలు మా దూకుడును ఆపలేవు అంటూ సుత్తిమెత్తగా హెచ్చరించారు. 
 
మా నూతన కార్యవర్గం సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ, మా ఎన్నికల్లో తమకు ఊహించని విధంగా మద్దతు ఇచ్చిన మీడియాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా, ప్రకాష్ రాజ్ వర్గం సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవానికి గైర్హాజరు కావడంపై ఆయన స్పందించారు. వారు ఏం చేసినా తమను ఆపలేరన్నారు.