ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (13:39 IST)

ఆయ‌న‌తో డ్యూయెట్ చేయాల‌నుందిః కత్రినా కైఫ్

Katrina Kaif, Jack Black
బాలీవుడ్ న‌టి కత్రినా కైఫ్ స‌న్‌డే రోజు బాగా ఎంజాయ్ చేసింది. ఫిట్‌నెస్‌కోసం డాన్స్‌లు వేస్తూ ఎన‌ర్జీని కూడ‌క‌ట్టుకుంది. హీరోయిన్లు వ్యాయామంతోపాటు డాన్స్ చేయ‌డం దైనందిక కార్య‌క్ర‌మాల‌లో ఓ భాగం. తాజాగా ఏ సండే రోజు ఇలా డాన్స్‌లేస్తూ వీడియోను సోష‌ల్‌మీడియాలో పెట్టింది.  అమెరిక‌న్ నటుడు, క‌మేడియ‌న్, మ్యుజీషియ‌న్‌ అయిన జాక్ బ్లాక్ వేస్తున్న డాన్స్‌ను అనుక‌రిస్తూ త‌నూ డాన్స్ వేస్తూ అన్ని భంగిమ‌లు చేసింది. జాక్ బ్లాక్ చేసిన‌దానికి రీట్రీట్‌లా తాను కొంత జోడించాన‌ని చెబుతోంది. ఈ వీడియోలో క‌త్రినాను చూసిన అభిమానులు ఆమెను 'అందమైన పడుచుపిల్ల' అని పిలుస్తున్నారు. ఒక సండేరోజు నేను డాన్స్ చేయాల‌నుకున్న‌ప్పుడు జాక్ వీడియో చూసి దాన్ని అనుక‌రించాను. ఇది మంచి ఆలోచన అనిపించింది. జాక్‌బ్లాక్‌, నేను ఒక రోజు కలిసి డ్యూయెట్ సాంగ్ చేస్తామని నిజంగా ఆశిస్తున్నాను` అంటూ ట్వీట్ చేసింది. తాజాగా క‌త్రినా ఫోన్ బూత్ సినిమాలో న‌టిస్తోంది.