గురువారం, 20 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 30 మే 2024 (11:55 IST)

బాలయ్య ఫుల్ వీడియో చూడండి పిల్ల CG వర్క్‌గాళ్లారా: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇన్సిడెంట్ పై రివర్స్ ట్వీట్స్

balayya-Anjali
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రి-రిలీజ్ వేడుకలో నటి అంజలి పట్ల హీరో బాలయ్య అనుచితంగా ప్రవర్తించాడంటూ కొన్ని ఛానళ్లు ప్రసారం చేసాయి. సోషల్ మీడియాలో సైతం దీనిపై రకరకాల కామెంట్లు చేస్తూ బాలకృష్ణపై దుమారం రేపారు. ఐతే అసలక్కడ అలాంటిదేమీ జరగలేదని చిత్ర యూనిట్ చెబుతోంది.
 
గ్రూప్ ఫోటో కోసం పిలిచినప్పుడు బాలయ్య అంజలిపై చేయి వేసి జరగమంటూ చెప్పారనీ, ఆ తర్వాత వాళ్లిద్దరూ చేతులతో క్లాప్ కొట్టినది కట్ చేసారని విమర్శించారు. బాలయ్య కూర్చున్నచోట ఎలాంటి బాటిల్స్ లేవనీ, ఎవరో కావాలని CG వర్క్ చేసి అలా క్రియేట్ చేసారని అన్నారు.