సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2023 (16:43 IST)

ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వెడ్డింగ్ డైరీస్

Arjun Ambati, Chandini Tamilarasan
Arjun Ambati, Chandini Tamilarasan
కామెడీ ఓరియెంటెడ్ లవ్ స్టోరీస్ ఎప్పుడూ కూడా ప్రేక్షకాదరణ పొందుతుంటాయి. ఇలాంటి కథా నేపథ్యం ఉన్న సినిమాలకు సినీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. వినోదంతో ప్రేమ కథను మిళితం చేస్తూ వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ సాధించాయి. ఇప్పుడు ఇదే బాటలో  వెడ్డింగ్ డైరీస్ అంటూ మరో పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. ఈ చిత్రంలో సుందరి ఫేమ్ అర్జున్ అంబటి, బుజ్జి ఇలా రా ఫేమ్ చాందిని తమిళరసన్ జంటగా నటిస్తున్నారు.  
 
రీసెట్ అండ్ రీస్టార్ట్ అనే డిఫరెంట్ ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. పెళ్లి తర్వాత ప్రేమ తగ్గిపోతుందా..? అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ బ్యూటిఫుల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు సినిమా ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర యూనిట్.. తాజాగా వెడ్డింగ్ డైరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ చూస్తుంటే.. ప్రేమించుకొని ఒక్కటైన జంట మధ్య భావోద్వేగాలను చూపించే సినిమా ఇది అని అర్థమవుతోంది.  
 
భార్యాభర్తలైన ప్రశాంత్-  శృతి మధ్య లవ్, రిలేషన్‌షిప్ లో అప్ అండ్ డౌన్స్.. చివరకు గొడవలతో వారు విడిపోవాలని నిర్ణయించుకోవడం లాంటి కథలో ట్విస్టులతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విడిపోవాలకున్న ఈ జంట తిరిగి తమ ప్రేమను బలపర్చుకొని వైవాహిక బంధాన్ని ఎలా కొనసాగించారు? ఆ భార్యాభర్తల సంఘర్షణల నడుమ ఏం జరిగింది? అనేది ఈ సినిమాలో మెయిన్ పాయింట్.   
 
ఎమ్‌విఆర్‌ స్టూడియోస్‌ పతాకంపై వెంకటరమణ మిద్దె స్వయంగా నిర్మిస్తూ ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. డాక్టర్ మిద్దె విజయ వాణి సమర్పిస్తున్న ఈ చిత్రంలో చమ్మక్ చంద్ర, జయలలిత, మేక రామకృష్ణ, రవితేజ పైల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈశ్వర్ వై కెమెరా వర్క్ చేస్తుండగా.. మదీన్ ఎస్కే సంగీతం అందిస్తున్నారు. మధు రెడ్డి ఎడిటర్ గా పని చేస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.
 
నటీనటులు: అర్జున్ అంబటి, చాందిని తమిళరసన్, చమ్మక్ చంద్ర, జయలలిత, మేక రామ కృష్ణ, రవితేజ పైలా.