ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 30 మార్చి 2023 (19:49 IST)

వెంకయ్యనాయుడి ప్రశంసలు పొందిన అరి సినిమా ట్రైలర్

Venkaiah Naidu, Jaya Shankar
Venkaiah Naidu, Jaya Shankar
ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మాతలు గా సహ నిర్మాత : లింగారెడ్డి గునపనేని వ్యవహరిస్తూ నిర్మించిన సినిమా ‘అరి’. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ఉపశీర్షిక. పేపర్ బాయ్ చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం అరి. తాజాగా ప్యాన్ ఇండియన్ ప్రొడ్యూసర్అభిషేక్ అగర్వాల్ చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చూసి చాల ఇంప్రెస్ అయ్యారు. 
 
ఈ సంధర్భంగా వెంకయ్య నాయుడుగారు మాట్లాడుతూ.. ‘ఈ రోజు అరి ప్రచార చిత్రాన్ని వీక్షించడం జరిగింది. చాలా సంతోషం. ఒక చక్కని ఇతివృత్తం, సందేశంతో కూడిన సినిమాను తీయాలని సంకల్పించడం చాలా అభినందనీయం. మన పూర్వీకులు చెబుతుండేవారు.. ఈ అరిషడ్వర్గాలంటే. కామ, క్రోధ, లోభ, మధ మాత్సర్యాలు. ఇవన్నీ లోపల ఉండే శతృవులు. వాటిని మనం జయించగలిగితే.. జీవితం సుఖంగా ఉంటుంది. మన చుట్టుపక్కల ఉండేవారు కూడా సుఖంగా ఉంటారు అని పెద్దవాళ్లు చెప్పారు. అలాంటి ఇతివృత్తంలో ఈ చిత్రం నిర్మించడం చాలా సంతోషం. సమాజానికి ఉపయోగపడేలా, సందేశంతో కూడిన చిత్రంగా సినిమాను తీయగలిగితే.. అది ప్రజల మెప్పు పొందుతుంది. ఆ సందేశం ప్రజల మనస్సుల్లో నాటుకుపోతుంది. ఆ దిశగా మీరు చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం అవుతుందని విశ్వసిస్తూ.. మంచి నేపథ్యాన్ని ఎంచుకున్న రచయిత, దర్శకుడు, నిర్మాత, నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’ అన్నారు.