గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రావొద్దని చెప్పాను : వెంకయ్య నాయుడు

venkaiah naidu
సూపర్ స్టార్ రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రావొద్దని తానే సలహా ఇచ్చానని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. మరింతకాలం ఆరోగ్యంగా ఉండాలంటే పాలిటిక్స్‌కు దూరంగా ఉండాలని హితవు పలికినట్టు చెప్పారు. 
 
చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో వెంకయ్యతో కలిసి రజనీకాంత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, రజినీకాంత్‌ మంచి నటుడని, ఆయనను తానే రాజకీయాల్లోకి రావద్దని చెప్పానని తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే రాజకీయాల్లోకి రాకూడదని సలహా ఇచ్చానని వెల్లడించారు. 
 
ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలు ఒక్కటే మార్గం కాదని, ఇందుకు అనేక మార్గాలున్నాయని వెంకయ్య తెలిపారు. అయితే రాజకీయాల్లోకి వచ్చేవారిని తాను నిరుత్సాహపరచడం తన వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చారు. యువకులు రాజకీయాల్లోకి రావాలని, అయితే క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావం, నిబద్ధత ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని ఆయన సూచించారు.