బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 మార్చి 2023 (08:08 IST)

రజనీకాంత్ చెల్లిగా జీవిత రాజశేఖర్ - 'లాల్‌సలామ్' చిత్రంలో కీలక పాత్ర

jeevitha
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించే 170వ చిత్రం పేరు "లాల్ సలామ్". ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై నిర్మాత సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జీవిత రాజశేఖర్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ విషయం తాజాగా వెల్లడైంది. 'లాల్ సలామ్' చిత్రంలో రజనీకాంత్‌కు చెల్లెలి పాత్రలో జీవిత కనిపించనున్నారు. 
 
ఈ సినిమాలో రజనీ చెల్లెలి పాత్రకి ప్రాధాన్యత ఉండటంతో జీవితను ఎంపిక చేశారు. చెన్నైలో జరుగుతున్న ఈ సినిమా షూటింగులో మార్చి 7వ తేదీ నుంచి జీవిత చిత్రం బృందంతో కలుసుకోనున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్‌లు కూడా నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలు చెన్నైలో జరిగాయి. అలాగే, సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది.