1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 21 మే 2025 (16:14 IST)

1991లో వీరరాజు కు ఏం జరిగింది?

Veeraraju 1991 team
Veeraraju 1991 team
రుద్ర వీరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరరాజు 1991. రా అండ్ రస్టిక్ గా తెరకెక్కిన ఈ చిత్రం మే 22 న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. రాయల్ స్టార్ ప్రొడక్షన్స్ సమర్పణలో కిరణ్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
 
హీరో రుద్రవీరాజ్ మాట్లాడుతూ, ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయడానికి ముఖ్య కారణం హరిచరణ్ అన్నారు. చాలా సపోర్ట్ గా నిలబడి పని చేశారు అన్నారు. కృష్ణ కాంత్ ఒక పాట రాశారు, రాంబాబు గోసాల రెండు పాటలు రాశారు. ప్రతీ టెక్నిషన్స్ కు థాంక్స్ చెప్పారు. ముఖ్యంగా నిర్మాత కిరణ్మయ్ చెరుకూరి గారికి ధన్యవాదాలు చెప్పారు. వారు లేకపోతే ఈ సినిమా లేదన్నారు. బెనర్జీ గారి సపోర్ట్ చాలా ఉందన్నారు. అలాగే అజయ్ గోష్ చాలా స్పెషల్ అన్నారు.

ఆయనతో కథ చెప్పిన నాటి నుంచి నేటి వరకు చాలా సపోర్ట్ చేశారు అన్నారు. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలామంది ప్రోత్సాహం ఉంది అందులో నెల్లూరు అవుట్ డోర్ షూటింగ్లో పోలీస్ పర్మిషన్లు తీసుకున్న నిర్మాత కిరణ్మయి గారి ఫ్రెండ్ గిరి బొల్లినేని గారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే రాక్ లయన్ వెంకటేష్, సునీల్ నరెన్, మ్యాంగో మ్యూజిక్ థాంక్స్ చెప్పారు. ఇక వైజాగ్లో తన యాక్టింగ్ నేర్చుకున్న సత్య ఇన్స్టిట్యూట్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మే 22 వీరరాజ్ 1991 సినిమా విడుదల అవుతుందని అందరూ కచ్చితంగా సపోర్ట్ చేయాలన్నారు. ముఖ్యంగా మీడియా సపోర్ట్ ఉండాలని కోరారు.
 
సహనిర్మాత శివాన్వితరావు మాట్లాడుతూ.. చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రం వాళ్ల అమ్మగారు అయిన నిర్మాత కిరణ్ చెరుకూరి కి ఎంతో స్పెషల్ అని చెప్పారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
 
రాంబాబు గోసాల మాట్లాడుతూ.. వీరరాజ్ సినిమాలో రెండు పాటలు రాశాను. గగన్ అందించిన మ్యూజిక్ చాలా బాగుంది. వీరరాజ్ చాలా కష్టపడ్డారు. నిర్మాత చాలా బాగా చూసుకున్నారు అని చెప్పారు. అజయ్ గోష్, బెనర్జీ గారి నటన చాలా బాగుందన్నారు. సినిమా పెద్ద హిట్ అవుతుందన్నారు. 
 
అజయ్ గోష్ మాట్లాడుతూ.. పరిశ్రమకు కొత్తవాళ్లు రావాలని, విజయం సాధించి పదిమందికి ఉపాది కల్పించాలన్నారు. చిన్న సినిమాలను ఆదరించాలని, ఇలాంటి సినిమాలు ఆడితే భవిష్యత్తులో మంచి ఆర్టిస్ట్ లు, టెక్నిషన్స్ పరిచయం అవుతారు. ముఖ్యంగా నిర్మాత కిరణ్ గారు ఎంతో శ్రద్ధతో, ప్రేమతో టీం చూసుకున్నారు. అలాగే బెనర్జీ గారితో పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక కథ విషయానికి వస్తే మత్స్యకారులు జీవితంలో జరిగే మంచి కథను చూపించారు. మత్స్యకారులు జీవితాలను చాలా అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా హీరోగా, దర్శకత్వం రెండు పనులను చాలా సమర్థవంతంగా నిర్వహించిన వీరరాజ్ శ్రమను ప్రేక్షకులు ఆదరిస్తారు అని నమ్మకం వ్యక్తం చేశారు. నిర్మాతగా కిరణ్ చెరుకూరి గారు మంచి అభిరుచి ఉన్న వ్యక్తి అన్నారు. 
 
బెనర్జీ మాట్లాడుతూ.. అజయ్ గోష్ తో చాలా తక్కువ సినిమాలే చేశాము కానీ మంచి పరిచయం ఉందన్నారు. అలాగే గొప్ప యాక్టర్ అన్నారు. ప్రొడ్యూసర్ కిరణ్మయ్ గారు లేడి ప్రొడ్యూసర్ గా మంచి భవిష్యత్తు ఉండాలన్నారు. ఆమె మంచితనమే సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తున్నారు. ఫస్ట్ టైం సినిమా తీసినట్లు కాకుండా చాలా బాధ్యతగా, చాలా ప్రేమగా చూసుకున్నారు అని చెప్పారు. నిర్మాత, సహా నిర్మాత ఇద్దరు తల్లీ కూతుర్లకు మంచి పేరు వస్తుందన్నారు. ఇక మరో హార్డ్ వర్కర్ హీరో, డైరెక్టర్ గా పని చేసిన వీరరాజ్ చాలా కష్టపడ్డారు అన్నారు. సినిమా తీయడం కాదు సినిమా రిలీజ్ చేయడం పెద్ద సాహసం అన్నారు. వీరరాజ్ 1991 సినిమాలో పనిచేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ చెప్పారు.