సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 28 సెప్టెంబరు 2019 (17:43 IST)

సైరా ర‌న్ టైమ్ ఎంత‌..? చెన్నైకి చిరు-తమన్నా

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సంచ‌ల‌న చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పైన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఇందులో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, కిచ్చా సుదీప్‌, విజ‌య్ సేతుపతి, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, ర‌వికిష‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.
 
గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌నున్నారు.
సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A  సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సెన్సార్ స‌ర్టిఫికెట్ ద్వారా తెలిసింది ఏంటంటే... ఈ సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాల 50 సెకన్లు అని. అంటే.. దాదాపు 3 గంట‌ల సినిమా. ఒక్కొక్క‌సారి నిడివి ఎక్కువుగా ఉండ‌డం అనేది సినిమాకి చాలా మైన‌స్ అవుతుంటుంది. 
 
ఒకవేళ ప్రేక్ష‌కుల‌కు బోర్ అనే ఫీలింగ్ క‌ల‌గ‌కుండా... సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా క‌థ‌నంలో ప‌ట్టు ఉంటే... ఫ‌ర‌వాలేదు. మ‌రి... ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించిన సైరా ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుంది..? ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుంది అనేది తెలియాలంటే అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు ఆగాల్సిందే. ఇదిలావుంటే సైరా ప్రమోషన్ కోసం చెన్నైకి చిరంజీవి-తమన్నా-చెర్రీ తదితరులు వెళ్లారు.