సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 28 సెప్టెంబరు 2019 (14:35 IST)

చిరంజీవికి కమల్ హాసన్ బిగ్ షాక్: గెలవడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు, మీ సలహాలు నాకొద్దు

సైరా చిత్రంతో ఊపు మీద వున్న మెగాస్టార్ చిరంజీవికి కమల్ హాసన్ గట్టి షాకిచ్చారు. ఇటీవలి సైరా ప్రమోషన్ కోసం తమిళనాడుకు చెందిన ఓ చానెల్‌తో మాట్లాడుతూ... కమల్ హాసన్-రజినీకాంత్ ఇద్దరూ రాజకీయాల్లోకి వద్దంటూ సలహా ఇచ్చారు. దీనిపై కమల్ హాసన్ స్పందించారు.
 
గెలుపు ఓటముల కోసం తను రాజకీయాల్లోకి రాలేదనీ, ప్రజల్లో చైతన్యం కోసం వచ్చానని అన్నారు. చిరంజీవీ... ఇకపై నాకెప్పుడూ సలహాలు ఇవ్వోద్దంటూ కమల్ ఘాటుగా సూచన చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం వల్లే ప్రజల ఆలోచనా ధోరణిపై అవగాహన పెరిగిందంటూ కమల్ హాసన్ తన రాజకీయ అరంగేట్రంపై సంతృప్తిని వ్యక్తం చేశారు.
 
కాగా రాజకీయాలు ధన, కుల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయనీ, ఎంతటి స్టార్లయినా రాజకీయాల్లో నిలబడం కష్టమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. దీనికి నిదర్శనమే తను, తన తమ్ముడు పవన్ కల్యాణ్ అని చెప్పారు. మంచి చేద్దామని ప్రజల్లోకి వెళ్లినా ఇతర రాజకీయ పార్టీలు కోట్ల రూపాయలు వెదజల్లి ఎన్నికల్లో విజయం సాధించారని చెప్పుకొచ్చారు. అందుకే... కమల్-రజినీ రాజకీయాల్లోకి వెళ్లకుండా వుంటే మంచిదని చిరంజీవి అభిప్రాయపడ్డారు.