రోడ్డుమీద నగ్నంగా టెంప్ట్ రాణి ఏం చేస్తోంది!
రెండేళ్ళనాడు ఏడు చేపల కథ అనే సినిమా వచ్చింది. అందులో టెంప్ట్ రవి పాత్ర తీరే వేరుగా వుంటుంది. అతను చూపు పడితే అమ్మాయి రాత్రికి రవి దగ్గరకు రావాల్సిందే. ఇలాంటి ఊర మాస్ కథతో అంతే ట్రీట్‌మెంట్‌తో ఆ సినిమా విడుదల చేశారు. సెన్సార్ నుంచి కూడా ఇబ్బంది వచ్చినా ఎట్టకేలకు రిలీజ్ అయి చిత్రమైన సినిమాగా నిలిచింది. ఆ తర్వాత ఈ తరహా సినిమాలకు మరలా రాలేదు. సినిమాలో చాలా భాగం ఎక్కడా ఆసక్తికరంగా సాగదు. ముఖ్యంగా బలం లేని బూతు సీన్స్ దానికి తోడు కాన్సెప్ట్ ఆధారంగా వచ్చే సన్నివేశాలు కూడా సెన్సార్ కి బలి అయిపోవడం మరియు సినిమా బాగా స్లోగా సాగుతూ బోర్ కొట్టడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని పూర్తిగా దెబ్బ తీశాయి. అయినా వారు మారలేదు.
తాజాగా ల్యాంప్ అనే పేరుతో అదే బేనర్‌లో దర్శక నిర్మాతలు తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. అందులో నాయికగా నటించిన అమ్మాయి దాదాపు బట్టలులేకుండానే వుంది. ఓ పోస్టర్‌లో కేవలం అదరాలకు ఓ అరటికా, లేంప్ మాత్రమే అడ్డుపెకొంది. ఇక మరో పోస్టర్‌లో ఏకంగా పూర్తి నగ్నంగా వుండి వెనకభాగం చూపిస్తుంది.
అదీ రోడ్డుమీద ఎవరికోసమే రాత్రి పూట వెతుకున్నట్లుగా వుంది. సో. ఈ సినిమా గురించి వివరాలు తెలపకుండా కేవలం పోస్టర్‌తో పబ్లిసిటీ చేస్తూ బయ్యర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. మరి మరి ఇలాంటి సినిమాలు సభ్య సమాజానికి ఏం చెబుతున్నాయన్నకంటే సెన్సార్ నుంచి ఎలా బయటకు వస్తుందనేది సస్పెన్స్. ఇక్కడ సెన్సార్ కాకపోతే ఢిల్లీనుంచి సర్టిఫికెట్ తీసుకువచ్చిన సందర్భాలు పలు సినిమాలు వున్నాయి. మరి ఇలాంటి సినిమాలకు పోస్టర్పై కూడా సెన్సార్ పెట్టాలని కొందరు అభిప్రాయపడుతున్నారు.