శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 మార్చి 2018 (14:56 IST)

మా పెళ్లాలను తిట్టినా మాకు సిగ్గురాదు : తమ్మారెడ్డి భరద్వాజ్ (Video)

సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ నా ఆలోచన అనే శీర్షికతో తన మనసులోని అంశాలను పంచుకున్నారు. ముఖ్యంగా, ఇటీవలికాలంలో ప్రతి ఒక్కరూ సినీ పరిశ్రమకు చెందిన వారిపై విమర్శలు గుప్పించడంపై ఆయన మండిపడ్డారు.

సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ నా ఆలోచన అనే శీర్షికతో తన మనసులోని అంశాలను పంచుకున్నారు. ముఖ్యంగా, ఇటీవలికాలంలో ప్రతి ఒక్కరూ సినీ పరిశ్రమకు చెందిన వారిపై విమర్శలు గుప్పించడంపై ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా, టీడీపీకి చెందిన ఎంపీ ఒకరు, ఎమ్మెల్సీ ఒకరు సినీ ఇండస్ట్రీపై తీవ్ర విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. 
 
అలాగే, ఇటీవల సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఇంటర్వ్యూ చేసిన బుల్లితెర నటి కూడా రాయడానికి వీల్లేదని భాషలో విమర్శలు గుప్పించింది. దీనిపై కూడా ఆయన మాట్లాడారు. టీడీపీ నేతలు, బుల్లితెర యాంకర్ చెప్పినట్టుగా సినీ ఇండస్ట్రీకి చెందిన మాకు సిగ్గూఎగ్గూ లేదన్నారు. అలాగే, మమ్మల్నేకాదు.. మా పెళ్లాలను తిట్టినా మాకు సిగ్గురాదు అని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియోను మీరూ తిలకించండి.