గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 2 ఆగస్టు 2019 (19:45 IST)

గుణ 369.. ఈ టైటిల్ పెట్ట‌డానికి కార‌ణం ఇదే

ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యువ హీరో కార్తికేయ‌. ఈ సినిమా సాధించిన సంచ‌ల‌న విజ‌యంతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ మూవీ త‌ర్వాత హిప్పీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆక‌ట్టుకోలేక‌పోయాడు. ఇప్పుడు గుణ 369 అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. 
 
ఈ చిత్రంలో కార్తికేయ స‌ర‌స‌న అన‌ఘ న‌టించింది. అర్జున్ జంథ్యాల ఈ సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అయ్యారు. అయితే.. గుణ 369 టైటిల్ పెట్ట‌డానికి కార‌ణం ఏంటి..? 369 అని ఎందుకు పెట్టారు..? అనేది ఆస‌క్తిగా మారింది. ఇదే విష‌యం గురించి ద‌ర్శ‌కుడు అర్జున్ జంధ్యాల‌ను అడిగితే.. అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టారు. 
 
మ్యాట‌ర్ ఏంటంటే... ఇది గుణ అనే యువకుడి ప్రేమకథ. 369 అనేది ఆ యువకుడు ఖైదీగా వున్నప్పటి నెంబర్. ఈ కథను నేను రాసిన త‌ర్వాత‌ ఎవరికీ వినిపించలేదు. 
 
ఈ పాత్రకి కరెక్టుగా ఎవ‌రు సెట్ అవుతారా.. అని నేను ఆలోచిస్తున్న‌ సమయంలో ఆర్ఎక్స్ 100 సినిమా చూశాను. ఆ సినిమాలో కార్తికేయను చూసిన తరువాత నా సినిమాలో హీరో పాత్రకి ఆయన అయితేనే కరెక్టుగా సెట్ అవుతాడనిపించింది. 
 
దాంతో ఆయనను కలిసి కథ చెప్పాను. కథ వినగానే ఆయన ఓకే చెప్పేశాడు. నేను అనుకున్నట్టుగానే ఈ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. కార్తికేయ కెరియర్లో ఇది గుర్తుండిపోయే పాత్ర అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పారు ద‌ర్శ‌కుడు అర్జున్ జంధ్యాల‌. మరి చిత్రం సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.