శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 25 డిశెంబరు 2018 (17:34 IST)

భాగమతి తర్వాత అనుష్క సినిమా.. లుక్ ఇదే..?

బాహుబలి దేవసేన అనుష్క తాజా సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. భాగమతి తర్వాత అనుష్క చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. తాజాగా కోనవెంకట్ వినిపించిన ఒక కథ నచ్చడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ  సినిమాకు ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాకు సంబంధించిన అనుష్క పోస్టర్‌ను సినీ యూనిట్ విడుదల చేసింది.
 
ఇప్పటివరకూ అనుష్క లుక్స్‌లో ఇది బెస్ట్‌గా కనిపిస్తోంది. తమ సినిమా నుంచి వచ్చిన ఈ లుక్ తనకు బాగా నచ్చిందని కోన వెంకట్ తెలిపారు. నెమలి ఈక పట్టుకుని అనుష్క లుక్ అదిరిపోతోంది. బాహుబలి, భాగమతికి తర్వాత కథాబలమున్న పాత్రలను ఎంచుకుంటున్న దేవసేన.. కోన వెంకట్ సినిమా స్క్రిప్ట్ నచ్చడంతో ఆ సినిమాలో నటించేందుకు పచ్చజెండా ఊపిందని సినీ జనం అంటున్నారు.