సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Modified: శనివారం, 15 డిశెంబరు 2018 (15:25 IST)

మళ్లీ బాహుబలి-దేవసేన జంటగా కొత్త చిత్రం...

ప్రభాస్-అనుష్క జంటగా నటిస్తున్నారంటే అభిమానుల్లో ఆనందం ఓ స్థాయికి వెళ్లిపోతుంది. మళ్లీ అదే జరుగబోతోంది. బాహుబలి చిత్రం తర్వాత పర్ఫెక్ట్ పెయిర్‌గా ముద్రపడిన ప్రభాస్-అనుష్క మళ్లీ మరో చిత్రంలో కలిసి చేసేందుకు అంగీకరించినట్లు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గుసగసలు వినిపిస్తున్నాయి.
 
జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో రొమాంటిక్ కపుల్‌గా నటిస్తున్నట్లు సమాచారం. కాగా ఇదే చిత్రంలో పూజా హెగ్డే మరో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్-అనుష్కలపై రొమాంటిక్ సన్నివేశాలుంటాయని తెలుస్తోంది. మరి ఈ వార్త నిజమైతే అభిమానులకు పండగే. ఇప్పటికే వీళ్లద్దరూ కలిసి మిర్చి, బిల్లా, బాహుబ‌లి చిత్రాల‌లో నటించారు. బాహుబలి చిత్రం తర్వాత వీరిరువురూ పెళ్లి చేసుకుంటున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఐతే వాటిని ఇద్దరూ ఖండించారు.