సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 19 మే 2018 (14:57 IST)

అబ్బాయిల్లాగానే అమ్మాయిలూ వర్జినిటీ కోల్పోతున్నారు.. తప్పేలేదు : హీరోయిన్

ఇటీవలి కాలంలో అమ్మాయిల కన్యత్వం (వర్జినిటీ)పై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ మళయాల హీరోయిన్ అమ్మాయిల కన్యత్వంపై ఓ కామెంట్ చేసింది. అబ్బాయిలు ఎలా అయితే పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటున్నా

ఇటీవలి కాలంలో అమ్మాయిల కన్యత్వం (వర్జినిటీ)పై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ మళయాల హీరోయిన్ అమ్మాయిల కన్యత్వంపై ఓ కామెంట్ చేసింది. అబ్బాయిలు ఎలా అయితే పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటున్నారో.. అదే విధంగానే అమ్మాయిలు కూడా పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొని వర్జినిటీని కోల్పోతున్నారని వ్యాఖ్యానించింది.
 
గతకొన్ని రోజుల నుంచి సినీమా నటీనటులు నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తూ అడ్డంగా బుక్కవుతున్నారు. అందులో హీరోయిన్లు అయితే మరి ఘోరం.. ఇటీవల ఓ హీరోయిన్ ఏకంగా కన్యత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో సోషల్ మీడియాలో  జనం చేత చివాట్లు తింటోంది.. వివరాల్లోకి వెళితే 
 
ఆ హీరోయిన్ పేరు యాషిక ఆనంద్‌. ఈమె తాజాగా నటించిన చిత్రం 'ఇరుట్టు అరైయిల్‌ మొరట్టు కుత్తు'. ఇది అడల్ట్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో ఎక్కువగా అడల్ట్ దృశ్యాలు ఉన్నాయి. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం వసూళ్ల పరంగా సంచలనం సృష్టిస్తోంది.. సినిమా మంచి హిట్ కావడంతో హీరోయిన్ యాషిక ఆనంద్‌ సంతోషంలో మునిగిపోయారు.
 
ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె 'పెళ్లికి ముందు అమ్మాయిలు తప్పు చేయటం సరైందేనా? అన్న ఓ ప్రశ్నకు ఆమె బదులిస్తూ... 'అందులో పెద్ద విషయం  ఏముంది. పెళ్లికి ముందు అబ్బాయిలు ఎలా అయితే వారి వర్జినిటి కోల్పోతారో అమ్మాయిలు కూడా అదే విధంగా కోల్పోతారు. ఇద్దరిలో పెద్దగా తేడాలు ఉండవు. అందులో తప్పు కూడా లేదు. ఎవరి ఇష్టం వాళ్లది' అంటూ కన్యత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.