బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వసుంధర
Last Modified: సోమవారం, 4 అక్టోబరు 2021 (22:30 IST)

ఇక్కడ చూడండి, ఎర్రగా ఎలా కందిపోయి కనిపిస్తున్నాయో: యామీ గౌతమ్

సహజంగా ఏదయినా అనారోగ్య సమస్య వస్తే చాలామంది దాచిపెడుతుంటారు. ఇక హీరోయిన్ల విషయంలో వేరే చెప్పక్కర్లేదు. ఒక్క ముక్క కూడా బయటకు రానివ్వరు. కానీ బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ మాత్రం తన చర్మంపై వచ్చిన దద్దుర్లను క్లోజప్ షాట్స్ తీసి ఫోటోలు షేర్ చేసింది.
 
వాటితో ఇలా రాసుకుంది. ''నేను ఇటీవల ఫోటో షూట్ చేసాను. ఆ సమయంలో నా చర్మాన్ని పరిశీలించినప్పుడు కెరోటోసిస్-పిలారిస్ అనే సమస్యను నా చర్మం ఎదుర్కొంటుందని తెలుసుకున్నాను. ఈ వాస్తవాన్ని మీకు షేర్ చేయాలనిపించింది'' అంటూ పేర్కొంది.