1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2022 (18:27 IST)

2022లో భారతీయ చిత్రసీమను ఏలిన టాప్-7 సినిమాలివే... కార్తీకేయ, ఆర్ఆర్ఆర్..

rrrforoscars
2023 వచ్చేస్తోంది. 2022లో భారతీయ చిత్ర పరిశ్రమను ఏలిన టాప్- 7 ప్రాంతీయ చిత్రాల వివరాలను తెలుసుకుందాం..  2022 సంవత్సరం వినోద పరిశ్రమకు అత్యంత నమ్మశక్యం కాని సంవత్సరం. థియేటర్లు తిరిగి యాక్షన్ లోకి వచ్చాయి. ప్రజలు వెండితెరపై కరోనా తర్వాత సినిమాలు చూశారు. అంతేకాకుండా ఓటీటీ పుణ్యమాని ప్రాంతీయ చిత్రాలు సూపర్ క్రేజ్ ఏర్పడింది. ప్రాంతీయ సినిమాలు థియేటర్లలో విడుదల కావడం భాషా అడ్డంకులను అధిగమించడమే కాకుండా ప్రేక్షకులకు కంటెంట్ కింగ్ గా మారింది.  ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రేక్షకులను చేరుకున్న ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదలైన తరువాత ఈ చిత్రాలు కూడా అపారమైన ప్రశంసలను పొందాయి. ఈ సంవత్సరం భారతీయ చిత్ర పరిశ్రమను ఏలిన టాప్ 7 ప్రాంతీయ చిత్రాల సంగతికి వస్తే.. 

Kooman
Kooman
కూమన్: ది నైట్ రైడర్
కూమన్: ది నైట్ రైడర్ 2022లో ఆసిఫ్ అలీ, హన్నా రేజీ కోషి, కరాటే కార్తీ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ మిస్టరీ థ్రిల్లర్. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఊహించని చీకటి కోణంతో ప్రేక్షకులను అలరించిన మాస్టర్ పీస్ థ్రిల్లర్. ఆసిఫ్ అలీ ఒక సూపర్ పోలీసు అధికారిపై ప్రతీకారం తీర్చుకునే పాత్రను పోషించాడు. నటుడిగా మెరిసిపోయాడు. ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. 
 
ఆర్ఆర్ఆర్ 
ఆర్ఆర్ఆర్ తెలుగు ఎపిక్ యాక్షన్ డ్రామా చిత్రం. హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో డబ్ చేయబడింది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా వసూలు చేసిన భారతీయ చిత్రాల జాబితాలో ఇది ఉంది. 
rrrmovie
rrrmovie



స్కాట్ డెరిక్సన్, జేమ్స్ గన్ వంటి ప్రసిద్ధ దర్శకులు కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించారు. అంతే కాదు, నాటు నాటు పాట 2023 ఆస్కార్ కు షార్ట్ లిస్ట్ చేయబడింది. ఈ గుర్తింపు పొందిన మొదటి భారతీయ పాట కూడా ఇదే. ఈ చిత్రం డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
 
కాంతారా
2022 లో విడుదలైన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కాంతారాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా వసూలు చేసి విజయం సాధించింది. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, ప్రభాస్, హృతిక్ రోషన్, అల్లు అర్జున్ ధనుష్, నటి అనుష్క శెట్టి తదితరులు రిసాబ్ శెట్టి అందించిన అద్భుతమైన నటన, ప్రత్యేకమైన కథాంశంపై ప్రశంసలు కురిపించారు. మీరు ఈ అద్భుతమైన చిత్రాన్ని ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.  
Kanthara
Kanthara
 
కె.జి.ఎఫ్: ఛాప్టర్ 2
కేజీఎఫ్ చాప్టర్ 2 కన్నడలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కె.జి.ఎఫ్: చాప్టర్ 2'. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో డబ్ చేసి ప్రపంచవ్యాప్తంగా 1,250 కోట్లకు పైగా వసూలు చేసింది. విజయంతో గర్జించిన యష్ అభిమానులు రాకీ లుక్ చూసి పొంగిపోయారు. 
KGF 2
KGF 2



38 మిలియన్ వ్యూస్ తో భారతదేశంలో అత్యధికంగా వీక్షించిన లిరికల్ వీడియోగా తూఫాన్ సాంగ్ నిలిచింది. 70వ దశకంలో వచ్చిన మసాలా చిత్రం 'కేజీఎఫ్ చాప్టర్ 2' థియేటర్లలో అభిమానులను అలరించింది. ఈ చిత్రం ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
 
సీతారామం
1960, 1970 దశకాల్లో జరిగిన ప్రేమకథా చిత్రం 'సీతారామమ్'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 91.4 కోట్లకు పైగా వసూలు చేసి భారీ  విజయాన్ని సాధించింది. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. 

sitaramam
 







777 చార్లీ
కన్నడ అడ్వెంచర్ కామెడీ డ్రామా చిత్రం, 777 చార్లీ కె కిరణ్ రాజ్ రచన- దర్శకత్వం వహించారు. కథ ఒక శునకం చుట్టూ తిరుగుతుంది. పాత్రల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా ప్రధాన నటుడు రక్షిత్ శెట్టి నటన ప్రేక్షకులు, విమర్శకుల నుండి అపారమైన ప్రశంసలను పొందింది. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో విడుదలైంది.  

777
777
 
 
కార్తికేయ 2
కార్తికేయ 2 2022 లో చందు మొండేటి దర్శకత్వం వహించిన తెలుగు మిస్టరీ, థ్రిల్లర్, యాక్షన్-అడ్వెంచర్ చిత్రం. సైన్స్ - లాజిక్ ను నమ్మే ఒక వైద్యుడి కథను ఈ చిత్రం వివరిస్తుంది. 
karthikeya-2



తన కుమారుడి కోసం ఐసియులో యజ్ఞం చేయడానికి ప్రయత్నించిన మేయర్ ను చెంపదెబ్బ కొట్టినందుకు వైద్యుడిని సస్పెండ్ చేశారు. ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల నుండి అపారమైన ప్రశంసలను అందుకుంది ఇది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది. ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.