టీవీ 9 రిపోర్టర్‌ని నేను తిట్టింది నిజమే: హీరో సునీల్
ఇటీవల టీవీ 9లో జాఫర్ అనే రిపోర్టర్ ఇంటర్వ్యూలో సునీల్ చాలా ఇరిటేట్ అయ్యాడు. నిన్ను చంపేస్తా అంటూ రిపోర్టర్ మీద సీరియస్ అయ్యాడు. నిజమే... ఆ రోజు నేను రిపోర్టర్‌ని తిట్టింది నిజమే. గతంలో అయితే... నాకున్న టెంపర్‌మెంట్‌కి ఏం చేసేవాడినో అంటున్న
ఇటీవల టీవీ 9లో జాఫర్ అనే రిపోర్టర్ ఇంటర్వ్యూలో సునీల్ చాలా ఇరిటేట్ అయ్యాడు. నిన్ను చంపేస్తా అంటూ రిపోర్టర్ మీద సీరియస్ అయ్యాడు. నిజమే... ఆ రోజు నేను రిపోర్టర్‌ని తిట్టింది నిజమే. గతంలో అయితే... నాకున్న టెంపర్‌మెంట్‌కి ఏం చేసేవాడినో అంటున్నాడు హీరో సునీల్. ‘జక్కన్న’ సినిమా కోసం టీవీ 9 న్యూస్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు సునీల్. ఆదివారం సాయంత్రం ప్రసారమయ్యే ఆ ప్రోగ్రామ్ రిపోర్టర్ సునీల్‌ను చాలా దారుణమైన ప్రశ్నలు అడిగాడు. ‘మీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా?’, ‘నువ్వు పుట్టిన కులం వల్లే ఇంత పైకి వచ్చావా?’ అంటూ ప్రశ్నించాడు.
కావాలనే... నన్ను ఇరిటేట్ చేయడానికే ఇలాంటి ప్రశ్నలు ప్లాన్ చేసుకుని వచ్చావా... ‘ఇలాంటి ప్రశ్నలు అడిగితే చంపేస్తా’ అని ఆ యాంకర్‌కు వార్నింగ్ కూడా ఇచ్చాడు సునీల్. అయితే అదొక ఫేక్ ఇంటర్వ్యూ అని, రేటింగ్ కోసం ఇలాంటి ప్రశ్నలు అడిగారని వార్తలు వచ్చాయి. వాటిపై సునీల్ ఇప్పుడు వివరణ ఇచ్చాడు. ‘అది ప్లాన్ ప్రకారం చేసింది కాదు. ఆ రిపోర్టర్ చాలా దారుణమైన ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలకు నిజంగానే సీరియస్ అయ్యాను అని చెప్పుకొచ్చాడు సునీల్.
ఇంటర్వ్యూ ముందే నాకు ఆ యాంకర్ ఈ ప్రోగ్రామ్‌లో రెగ్యులర్ ప్రశ్నలు కాదు.. కొంచెం స్ట్రాంగ్‌గా అడుగుతాను అని చెప్పాడు. మీ ప్రశ్నలను బట్టే నా సమాధానం ఉంటుంది అని చెప్పా. అలాగే సీరియస్‌గా సమాధానాలు ఇచ్చా... నేను ఇప్పుడు కూల్‌గా కనబడుతున్నాను కానీ, మొదట్లో చాలా రెబల్‌గా ఉండేవాడిని అంటూ సునీల్ వివరించాడు.