శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జనవరి 2022 (14:49 IST)

కంగనా పోస్టులను అడ్డుకోలేం: వాటిని పట్టించుకోవడం మానేయాలి

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఏ విషయాన్నైనా బోల్డుగా ప్రస్తావించే ధైర్యం ఆమెది. ప్రస్తుతం టాప్ హీరోయిన్ ఇమేజ్ దక్కించుకున్న కంగనా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటుంది.
 
కేవలం సినిమా అప్డేట్స్ గురించే కాకుండా.. సామాజిక విషయాలపై కూడా తనదైన రీతిలో స్పందిస్తుంటుంది. అప్పుడప్పుడు ఆమె చేసే పోస్టులు వివాదాస్పదం కూడా అవుతుంటాయి. అలా చేసిన ఓ పోస్టే.. కంగనాకు మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తీవ్ర మాటల యుద్ధానికి తెరలేపింది. 
 
ఇటీవల కంగనా సిక్కులు, ముంబై పోలీసులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ముంబైకి చెందిన సర్దార్ చరణ్ జిత్ సింగ్ అనే న్యాయవాది సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 
 
ఈ పిటిషన్‌పై విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం.. కంగన రనౌత్ సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యల్ని అడ్డుకోలేమని స్పష్టం చేసింది. ఆమె పోస్టులపై కోర్టులను ఆశ్రయించడానికి బదులుగా వాటిని పట్టించుకోవడం మానేయాలని లేదంటే క్రిమినల్ చట్టాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది.