మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (12:55 IST)

పోర్న్ చిత్రాల రాకెట్‌ కేసులో పూనమ్ పాండేకు ఊరట

బాలీవుడ్ నటి పూనమ్ పాండేకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పోర్న్ రాకెట్ కేసులో ఆమెకు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ లభించింది. ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా సైతం అరెస్టు నుంచి రక్షణ పొందడం తెల్సిందే. 
 
ఈ కేసులో తనను సైతం అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన పూనమ్ పాండే ముందస్తు బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ చుక్కెదురైంది. దీంతో పూనమే సుప్రీంకోర్టు తలపుతట్టారు. 
 
దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి కోర్టు తదుపరి ఉత్తర్వులు జారీచేసేంత వరకు పిటిషన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టరాదని పేర్కొంటూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
కాగా, పోర్న్ వీడియోలను పంపిణీ చేశారంటూ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాతో పాటు.. బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రాతో పాటు పూనమ్ పాండేపై కేసు నమోదు చేశారు.